Andhra Pradesh: ‘ఏం పీ**వ్.. చెప్పు తెగుద్ది’.. బూతులతో రెచ్చిపోయిన లేడీ ఎక్సైజ్‌ సీఐ.. ఫిర్యాదు చేసినందుకు..

|

Mar 03, 2023 | 12:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓ లేడీ ఎక్సైజ్‌ సీఐ రెచ్చిపోయింది. ఇసుక, మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు.. చర్యలు తీసుకోండని కంప్లైంట్‌ చేసినందుకు రివర్స్‌లో ఫిర్యాదుదారుడినే బెదిరించింది.

Andhra Pradesh: ‘ఏం పీ**వ్.. చెప్పు తెగుద్ది’.. బూతులతో రెచ్చిపోయిన లేడీ ఎక్సైజ్‌ సీఐ.. ఫిర్యాదు చేసినందుకు..
Mylavaram Excise Ci Girija
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఓ లేడీ ఎక్సైజ్‌ సీఐ రెచ్చిపోయింది. ఇసుక, మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు.. చర్యలు తీసుకోండని కంప్లైంట్‌ చేసినందుకు రివర్స్‌లో ఫిర్యాదుదారుడినే బెదిరించింది. మళ్లీ కంప్లైంట్‌ చేశావంటే నీపైనే రివర్స్‌ కేసులు పెడతానంటూ నోటికొచ్చినట్లు తిట్ల దండకం అందుకుంది. ఇంతకీ, ఆ లేడీ సీఐ ఎవరో? ఆ కథంటో చూడండి. ఒంటిపై ఖాకీ డ్రెస్‌, చేతిలో అధికారం, ఈ రెండూ ఉంటే తామేం చేసినా చెల్లుతుందనే లెక్కలో రెచ్చిపోతున్నారు కొందరు పోలీసులు. పెద్దోళ్లకు సలాములు కొడుతూ సామాన్యులపై ప్రతాపం చూపించడమే తమ పని అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. విచారణ పేరుతో రెచ్చిపోవడం, నోటికొచ్చి తిట్టడం, కసితీరా కొట్టడం, ఒక్కోసారి లాకప్‌లోనే చంపేయడం ఇదీ కొందరు పోలీసుల తీరు.

ఖాకీల క్రూరత్వానికి ఆడామగా తేడా లేదని నిరూపించింది ఓ లేడీ సీఐ. బాధితుడికి ఫోన్‌చేసి నోటికొచ్చినట్టు తిడుతూ చెలరేగిపోయింది మైలవరం ఎక్సైజ్‌ సీఐ గిరిజ. ఎందుకు మాటమాటికీ కంప్లైంట్స్‌ ఇస్తున్నావ్‌ అంటూ బెదిరించడమే కాకుండా పాత కేసులు తీసి నువ్వే ముద్దాయి అని రాసేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఏం పీకుతావ్ నువ్వు, నీ వల్ల ఏం అవుద్ది, ఏంట్రా, నోర్మూయ్‌, చెప్పు తెగుద్ది అంటూ రెచ్చిపోయింది మైలవరం ఎక్సైజ్‌ సీఐ గిరిజ..

అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోమని కంప్లైంట్‌ ఇచ్చినందుకు రివర్స్‌లో తనకే ఫోన్‌చేసి బెదిరించిన ఎక్సైజ్‌ సీఐ గిరిజపై చర్యలు తీసుకోవాలంటున్నాడు బాధితుడు వెంకటకృష్ణ.

ఇవి కూడా చదవండి

మొన్నటివరకు మైలవరం నివాసమున్న వెంకటకృష్ణ ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల వెళ్లి అక్కడే జీవిస్తున్నాడు. అయితే, చండ్రగూడెంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా జరుగుతోందని 14500కి ఫోన్ చేసి కంప్లైంట్స్‌ చేశాడు. అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటూ మళ్లీమళ్లీ ఫిర్యాదు చేశాడు. దాంతో, వెంకటకృష్ణకు ఫోన్‌చేసిన మైలవరం ఎక్సైజ్‌ సీఐ గిరిజ… బూతుల దండకం అందుకున్నారు. మళ్లీ కంప్లైంట్‌ ఇచ్చావో నీపైనే కేసులు పెడతానంటూ వార్నింగ్‌ ఇవ్వడం కలకలం రేపుతోంది. మరి, ఫిర్యాదుదారుడినే బెదిరించిన సీఐ గిరిజపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా?.

మరిన్ని ఏపీ వార్తల కోసం..