AP MPTC ZPTC Election Result: అత్తా కోడళ్ల మధ్య హోరాహోరి పోరు.. చివరకు ఎంపీటీసీగా గెలిచిందెవరంటే..?

AP MPTC ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ పోరు ఏకపక్షంగా మారిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ

AP MPTC ZPTC Election Result: అత్తా కోడళ్ల మధ్య హోరాహోరి పోరు.. చివరకు ఎంపీటీసీగా గెలిచిందెవరంటే..?

Updated on: Sep 19, 2021 | 12:31 PM

AP MPTC ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ పోరు ఏకపక్షంగా మారిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో వైసీపీ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచే పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు పూర్తిగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో అత్తా కోడళ్ల కొట్లాట ఇంటికో.. వంటింటికో పరిమితం కాలేదు. రాజకీయాల్లోనూ అత్తాకోడళ్ల పోరు కనిపిస్తోంది. కడప జిల్లాలో జరిగిన ఈ పోరులో కోడలే పై చేయి సాధించింది.

కడప జిల్లాలోని పెద్దముడియం మండలం భీమగుండం ఎంపీటీసీ స్థానంలో అత్తా కోడళ్ల మధ్య పోటి హోరాహోరిగా కొనసాగింది. ఉత్కంఠగా సాగిన ఈ పోటీలో అత్తపై కోడలు ఎంపీటీసీగా గెలుపొందింది. భీమగుండం ఎంపీటీసీ అభ్యర్ధిగా బీజేపీ తరపున అత్త పోటీ చేయగా.. వైసీపీ తరపున కోడలు పోటీచేసింది. హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. చివరకు అత్తపై వైసీపీ అభ్యర్థి సుజాత 216 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది పేర్కొన్నారు. 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది పేర్కొన్నారు. 2 చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయని.. 4 చోట్ల తడిచాయన్నారు.

ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్ పై స్థానిక కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

 

Also Read:

AP MPTC ZPTC Elections Counting Live: ఏకపక్షంగా పరిషత్ ఫలితాలు.. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ హవా..

Balapur Laddu:1994 నుంచి 2021 వరకు బాలాపూర్ లడ్డు వేలం వివరాలు.. ఎవరెవరు దక్కించుకున్నారు..!