Kakinada: దళిత యువకుడి హత్య కేసులో జైల్లో ఉన్న అనంతబాబుకు బెయిల్ మంజూరు

|

Aug 22, 2022 | 5:44 PM

హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. తల్లి చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయనకు 3 రోజుల బెయిల్ ఇచ్చింది.

Kakinada: దళిత యువకుడి హత్య కేసులో జైల్లో ఉన్న అనంతబాబుకు బెయిల్ మంజూరు
MLC Anantha Babu
Follow us on

Andhra Pradesh: తన మాజీ కార్ డ్రైవర్, దళిత యువకుడు సుబ్ర‌మ‌ణ్యంను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న  ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు(mlc anantha babu)కు 3 రోజులు బెయిల్ మంజూరు చేసింది రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు.  అనంతబాబు తల్లి మంగారత్నం మృతి చెందడంతో అంత్యక్రియల నిమిత్తం 3 రోజుల బెయిల్ ఇచ్చింది. 25 వేల నగదు.. ఇద్దరు పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది. కాగా ఈ కేసులో కాకినాడ పోలీసులు సమర్పించిన ఛార్జిషీటును అసంపూర్తిగా ఉందన్న కారణంతో ఆదివారం కోర్టు తిరస్కరించింది. మే 19న సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ కేసులో ఎమ్మెల్సీ పాత్రపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రతిపక్షాల ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి పెరిగింది. చివరకు  శాసన మండలి చైర్మన్‌కు సమాచారం ఇచ్చి.. మే 23వ ఎమ్మెల్సీ అనంత‌బాబును తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అనంతబాబును రిమాండ్‌లో ఉంచి.. శ‌నివారానికి 90 రోజులు కంప్లీట్ అయ్యాయి. కాగా ఈ కేసు నత్తనడకన సాగుతుందని.. నిందితుడు తప్పించుకునేలా పోలీసులు సహకరిస్తున్నారని.. బాధిత కటుంబం ఆరోపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..