
ప్రధాని మోదీతో మంత్రి రోజా సెల్ఫీ దిగడం అల్లూరి 125 వ జయంతోత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచింది. సభ ముగింపులో “మోదీ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్..”అంటూ అడగడం.. రోజా అడిగిన వెంటన సెఫ్లీకి సీఎం జగన్‌తో కలిసి వచ్చి దిగారు. ఈ సీన్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. భీమవరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతోపాటు రోజు కూడా పాల్గొన్నారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత మంత్రి పదవి దక్కించుకున్న రోజాకు మరో అరుదైన అవకాశం దక్కింది. దేశ ప్రధాని మోదీ, సీఎం జగన్ కలిసి హాజరైన ఒక అరుదైన వేదికపై మంత్రి హోదాలో పాల్గొన్నారు రోజా. ప్రధాని ఆశీనులైన వేదిక పైన మొత్తం 11 మందికి అవకాశం దక్కింది. అందులో గవర్నర్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా రోజా, చిరంజీవి, సోము వీర్రాజు ఉన్నారు. కేంద్ర – రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా రోజా కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం గురించి పత్రికల్లో భారీ స్థాయిలో మంత్రి హోదాలో రోజా ప్రకటనలు ఇచ్చారు.