టిడిపి జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాపై తనదైన శైలిలో రియక్ట్ అయ్యారు మంత్రి ఆర్కే రోజా. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి ఆర్ కే.రోజా టిడిపి జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాను చూసి ఆ పార్టీల కార్యకర్తలు ఏడుస్తున్నారన్నారు. టిడిపి, జనసేన ఉమ్మడి జాబితా చూసాక 175 స్థానాలు కొడతామన్న ధీమాతో వైసీపీ శ్రేణుల్లో డబుల్ అయిందన్నారు. అందుకే సంబరాలు జరుపు కుంటున్నారని తెలిపారు. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అన్న పవన్ కళ్యాణ్ పావలా షేర్ సీట్లు కూడా తీసుకోలేదన్నారు మంత్రి రోజా. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నారో ఆ పార్టీ కేడర్‌కు పవన్ కళ్యాణ్ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
24 సీట్లకే ఎందుకు తల వంచారో కూడా పవన్ జనసేన కార్యకర్తలకు చెప్పాలన్నారు.పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో చంద్రబాబు చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని విమర్శించారు. కమీషన్ల కోసం పోలవరంను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని చంద్రబాబు తాకట్టు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడన్నారు మంత్రి ఆర్కే రోజా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..