ఉల్లి ధర గురించి నో టెన్షన్.. ఎంతైనా అక్కడ మాత్రం కిలో రూ.25కే..

| Edited By: Srinu

Dec 09, 2019 | 2:21 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు ఉల్లి ధర ఆకాశాన్నంటుతుంటే.. ఏపీలో మాత్రం ధర తగ్గుముఖం పడుతోంది. అయితే బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఉల్లి ధర దాదాపు రూ.90 నుంచి రూ.120 వరకు ఉంది. ఇదిలా ఉంటే.. ప్రజలు ఇబ్బందులు పడకూడదని జగన్ సర్కార్ ఉపశమన చర్యలు తీసుకున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే వారి కోసం ఉల్లిని సబ్సిడీ కింది రైతుబజార్లలో అమ్ముతున్నట్లు మంత్రి మోపిదేవి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో […]

ఉల్లి ధర గురించి నో టెన్షన్.. ఎంతైనా అక్కడ మాత్రం కిలో రూ.25కే..
Follow us on

దేశ వ్యాప్తంగా ఓ వైపు ఉల్లి ధర ఆకాశాన్నంటుతుంటే.. ఏపీలో మాత్రం ధర తగ్గుముఖం పడుతోంది. అయితే బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఉల్లి ధర దాదాపు రూ.90 నుంచి రూ.120 వరకు ఉంది. ఇదిలా ఉంటే.. ప్రజలు ఇబ్బందులు పడకూడదని జగన్ సర్కార్ ఉపశమన చర్యలు తీసుకున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే వారి కోసం ఉల్లిని సబ్సిడీ కింది రైతుబజార్లలో అమ్ముతున్నట్లు మంత్రి మోపిదేవి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. ఏపీలో ప్రభుత్వం ప్రజలకు కేవలం కిలో రూ.25కి అందిస్తుందని గుర్తు చేశారు. అన్ని రైతుబజార్లలో ఉల్లి సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. సామాన్యులకు భారం కాకుడదనే జగన్ సర్కార్.. కిలో ఉల్లికి రూ. 90 నుంచి 100 వరకూ సబ్సిడీ భారాన్ని భరిస్తోందన్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు దేశంలో పలు రాష్ట్రాల్లో ఉల్లి ధర డబుల్ సెంచరీ చేరుకుంది. తాజాగా ఢిల్లీలో కిలో ఉల్లి దర రూ.200 మార్క్‌ దాటింది. ఇక చాలా రాష్ట్రాల్లో కిలో రూ.150కి పైగా ఉంది. ముఖ్యంగా ఈ సారి పడ్డ భారీ వర్షాలే ఉల్లి డిమాండ్‌కు కారణమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఈ సారి విపరీతమైన వర్షాలు పడ్డాయి. దీంతో ఉల్లి పంటలు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశాయి.