Andhra Pradesh Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. APPSC ద్వారా 8402 ఉద్యోగాల భర్తీకి మంత్రి ప్రకటన..

|

Mar 10, 2021 | 9:12 PM

Andhra Pradesh Jobs: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 8,402 సచివాలయ..

Andhra Pradesh Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. APPSC ద్వారా 8402 ఉద్యోగాల భర్తీకి మంత్రి ప్రకటన..
Follow us on

Andhra Pradesh Jobs: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 8,402 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లలపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ సారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ఖాళీగా ఉన్న పోస్టులలను ఏపీపీఎస్సీకి పంపించి క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎంపీడీవోల పదోన్నతులపైప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళా దినోత్సవం నాడు ఇచ్చిన హామీ రెండు రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా 5 రోజులు సెలవులు ఇవ్వాలని మహిళా దినోత్సవం రోజు వైఎస్ జగన్ ప్రకటించగా, అందుకు ప్రత్యేక సీఎల్‌లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులను అదనంగా ఐదు రోజులు మంజూరు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి చదవండి:

Onion Price Reduced: దిగి వస్తున్న ఉల్లిపాయ ధర.. ఏడు రోజుల్లో 21 రూపాయలు తగ్గిన ఉల్లి

Nikhil Siddharth: హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌కు గాయాలు.. కార్తికేయ 2 షూటింగ్‌లో యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తుండగా ప్రమాదం