
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, అన్నమయ్య జిల్లాల్లో పిడుగు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నం తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, కోరుకొండ, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, ఏలేశ్వరం, అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి, రామాపురం,రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె మండలాలు, వాటి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఆ ప్రాంతంలోని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు.. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యధికంగా విజయవాడలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అనకాపల్లిలో అత్యల్పంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Rahul Gandhi Visit: ఓయూ చుట్టూ పొలిటికల్ హై ఓల్టేజ్ ఎపిసోడ్.. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం