AP Local Body Elections: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలకు షాక్.. బంగారుపాశ్యం, కలకడ జెడ్‌పిటిసి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

|

Nov 07, 2021 | 12:04 PM

చిత్తూరు జిల్లాలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బంగారుపాళ్యం, కలకడ జెడ్‌పిటిసి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పరిశీలన పూర్తయింది.

AP Local Body Elections: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలకు షాక్.. బంగారుపాశ్యం, కలకడ జెడ్‌పిటిసి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
Follow us on

AP Local Body Elections: చిత్తూరు జిల్లాలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బంగారుపాళ్యం, కలకడ జెడ్‌పిటిసి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పరిశీలన పూర్తయింది. దీంతో ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేషన్లు సక్రమంగా దాఖలు చేయలేదని ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ జెడ్‌పిటిసి అభ్యర్థిగా నామినేషన్ తిరస్కరించారు. అయితే, రాజకీయ కక్షతోనే అధికారులు నామినేషన్ తిరస్కరించారని తామ కోర్టును ఆశ్రయిస్తామని నామినేషన్ తిరస్కరణకు గురైన టిడిపి అభ్యర్థులు మండిపడ్డారు.

చిత్తూరు జిల్లాలోని బంగారు పాల్యం, కలకడ మండలాలకు సంబంధించిన జెడ్పిటిసి ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శుక్రవారం రోజు తమ తమ నామినేషన్లను దాఖలు చేసుకున్నారు. అయితే, నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని అందువల్ల వారి దరఖాస్తులను తిరస్కర్రిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఎం ఎస్ మురళి ప్రకటించారు. బంగారుపాళ్యం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిరిబాబు అఫిడవిట్ వీటిలో కాలం సంఖ్య 5(9), సదరు అభ్యర్థి ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రంలో రుణం క్లియర్ కాలేదని ప్రత్యర్థి అభ్యంతరం తెలిపారు.

అదేవిధంగా కలకడ మండలం టిడిపి అభ్యర్థిగా సురేఖ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన పుట్టిన తేదీ, కుల ధ్రువీకరణలో ఇచ్చిన పుట్టినతేది, ఆధార్ కార్డులో గల తేదీలు వేరు వేరుగా ఉన్నాయని, వయస్సు నిర్ధారణ కు సంబంధించి ధ్రువీకరణ సమర్పించలేదు. డిక్లరేషన్ ఫారం లో దరఖాస్తుకు సాక్షి సంతకం చేసిన వారి అడ్రస్ వ్రాయలేదు. పొదుపు సంఘంలో రెండవ లీడర్‌గా వుంటూ రుణం క్లియర్ చేయలేదని, అందుకు సంబంధించి ప్రత్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమక్షంలో నవంబరు 07 తేదీ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 లోపల అప్పీలు చేసుకోవచ్చునని రిటర్నింగ్ అధికారి తెలిపారు.అయతే రాజకీయ కక్షలతో అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారని నామినేషన్ లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆరోపించారు తాము కోర్టును ఆశ్రయిస్తామని వివరించారు.తప్పుడు సమాచారం అధికారులను తప్పుదారి పట్టించడం సరికాదని టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు.

Read Also…  BJP: ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌..