AP Inter Board: నిబంధనలు ఉల్లంఘిస్తే జూనియర్‌ కాలేజీలకు దిమ్మతిరిగే జరిమానాలు.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

|

May 05, 2023 | 1:04 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ విద్యామండలి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే ఇంటర్మీడియట్‌ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు దిమ్మతిరిగే జరిమానాలు విధించనున్నట్లు..

AP Inter Board: నిబంధనలు ఉల్లంఘిస్తే జూనియర్‌ కాలేజీలకు దిమ్మతిరిగే జరిమానాలు.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
AP Inter Board
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ విద్యామండలి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇకపై ఇష్టారీతిగా నిబంధనలు ఉల్లంఘించే ఇంటర్మీడియట్‌ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు దిమ్మతిరిగే జరిమానాలు విధించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకున్న జరిమానాలను భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మండలం, పుర, నగరపాలికల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుమతి లేకుండా కళాశాలను మార్చితే విధించే జరిమానా రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచింది. మండలం నుంచి మండలానికి, మండలం నుంచి పుర, నగరపాలక ప్రాంతానికి అనధికారికంగా మార్చితే విధించే జరిమానా రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

అలాగే అనుమతులు లేకుండా ఇతర సొసైటీలు, ట్రస్టులకు మార్పు చేసినా కూడా రూ.అయిదు లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మహిళా కళాశాలగా అనుమతి తీసుకొని, కో ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తే రూ.రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని బోర్డు హెచ్చరించింది. ఈ మేరకు తెలియజేస్తూ రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.