AP Inter Admissions 2023: మే 15 నుంచి ఏపీ ఇంటర్‌ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు.. తరగతులు ఎప్పట్నుంచంటే..

|

May 12, 2023 | 8:13 PM

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ 2023-24 ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది..

AP Inter Admissions 2023: మే 15 నుంచి ఏపీ ఇంటర్‌ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తులు.. తరగతులు ఎప్పట్నుంచంటే..
AP Inter Admissions 2023
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ 2023-24 ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాలను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మే 15 నుంచి మొదటి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్‌ 14 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. 26 నుంచి జూన్‌ 14 వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి.

జూనియర్‌ కళాశాలల ప్రవేశాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యుఎస్‌కు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు ఆదేశించింది. బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇంటర్మీడియట్‌లో చేరగోరే విద్యార్థులకు అడ్మిషన్‌ ఇచ్చే క్రమంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ మార్కుల జాబితా, విద్యార్థులు చివరగా చదివిన పాఠశాల అధికారులు జారీ చేసిన పదో తరగతి పాస్ సర్టిఫికేట్, టీసీలతో తాత్కాలిక అడ్మిషన్లు కల్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.