High Court: ఉపాధి హమీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా!

AP High Court on NREGA Job Card: ఉపాధి హమీ పనులపై ఎటువంటి విజిలెన్స్ విచారణ జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదకను అఫిడవిట్ రూపంలో హైకోర్టులో దాఖలు చేసింది కేంద్రం

High Court: ఉపాధి హమీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా!
Ap High Court

Updated on: Sep 29, 2021 | 7:16 PM

AP High Court: ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హమీ పనులపై ఎటువంటి విజిలెన్స్ విచారణ జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదకను అఫిడవిట్ రూపంలో హైకోర్టులో దాఖలు చేసింది కేంద్రం. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను హైకోర్టు రికార్డు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ కూడా విజిలెన్స్ విచారణ జరగడం లేదని చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. విజిలెన్స్ విచారణ కారణంగా బిల్లుల చెల్లింపు నిలిపివేశామన్న.. ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. రెండు లక్షల 70 వేల పనుల్లో 4 వేల పనులపై మాత్రమే విచారణ జరుగుతుందని, ప్రభుత్వం పేర్కొనడాన్ని హైకోర్టు అంగీకరించింది.

అయితే, బిల్లులు చెల్లింపునకు సంబంధించి వడ్డీతో కలిపి ఇవ్వాలా, ఏ నిధుల నుంచి ఈ బిల్లులు చెల్లించాలనే అంశంపై హైకోర్టులో వాదనలు వినేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వచ్చే నెల 4కు కేసు విచారణ జరుపుతామంటూ హైకోర్టు తెలిపింది. దీంతో విచారణను అక్టోబర్ 4వతేదీకి వాయిదా వేసింది. 700 పిటిషన్లపై వచ్చేనెల 8న తీర్పు ఇస్తామని హైకోర్టు ప్రకటించింది. పిటిషనర్ల తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదించారు.

Read Also….   Crime News: పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంది.. ప్రశ్నించినందుకు కత్తితో పొడిచింది.. చివరికి..