Vijayawada ACP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, ఆయన ఆ ఆదేశాలు పాటించలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా నాలుగు వారాలపాటు జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలును.. హైకోర్టు వారంపాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
కాగా.. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అమలు చేయకపోవడంతో.. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గిరిజా శంకర్, చిరంజీవి చౌదిరలకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Also Read: