Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠంపై హైకోర్టులో విచారణ.. ధార్మిక పరిషత్ జోక్యంపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం

|

Jul 01, 2021 | 7:36 PM

బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎపిసోడ్‌ ముగిసింది.. శుభం కార్డు కూడా పడిదని అనుకునే లోపే.. మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది.

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠంపై హైకోర్టులో విచారణ.. ధార్మిక పరిషత్ జోక్యంపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
Brahmamgari Matam
Follow us on

Brahmamgari Matam Case in High Court: బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎపిసోడ్‌ ముగిసింది.. శుభం కార్డు కూడా పడిదని అనుకునే లోపే.. మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం.. మఠానికి పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని ప్రకటించడం.. అలాగే.. రెండో భార్య కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎంపిక చేసి వివాదం సుఖాంతమైందని అందరూ అనుకున్నారు. కానీ.. వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి.. మరో షాక్‌ ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో.. మళ్లీ మఠం వివాదం మొదటికి వచ్చింది. అయితే.. ఆమె పూటకో మాట మాట్లాడుతుండటం.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఇదిలావుంటే, గ్రామస్థులు, ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం కావడంతో ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయని, ఇవి సఫలం అయినట్లు..స్థానికంగా ఉన్న వారు వెల్లడించారు. మఠాధిపతిగా రెండో భార్య మహాలక్ష్మమ్మ కుమారుడికి ఛాన్స్ వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక జరిగింది. ఈ మేరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన మరణించిన మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి

దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. మఠానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్ తీసుకోవాలని కోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించి ధార్మిక పరిషత్ అనుమతించిందా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

Read Also…  Contact Marriage: డబ్బు కోసం నకిలీ పెళ్లిళ్లు.. విదేశాలకు వెళ్లి విడాకులు..అమ్మాయిల నయాదందా..ఎక్కడంటే