AP High Court: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ నుంచి సరికొత్త జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..

| Edited By: Ravi Kiran

Jan 16, 2024 | 9:45 AM

సంక్రాంతి పండుగ వేళ అదిరిపోయే నోటిఫికేషన్ వెలువడింది. హైకోర్టులో ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. స్టేట్ జ్యుడీషియల్ సర్వీసెస్‎లో భాగంగా జూనియర్ డివిజన్ బెంజ్‎కు సంబంధించిన 39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

AP High Court: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ నుంచి సరికొత్త జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..
Ap High Court
Follow us on

సంక్రాంతి పండుగ వేళ అదిరిపోయే నోటిఫికేషన్ వెలువడింది. హైకోర్టులో ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. స్టేట్ జ్యుడీషియల్ సర్వీసెస్‎లో భాగంగా జూనియర్ డివిజన్ బెంజ్‎కు సంబంధించిన 39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇందులో 32 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయగా.. మిగిలిన 7 పోస్టులను ట్రాన్స్‎ఫర్ పద్దతిలో నియామకాలు జరుగుతాయి. ఇక అర్హతల విషయానికొస్తే.. లా విద్యలో డిగ్రీ పట్టా పొంది ఉండాలి. వయసు 35 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ క్యాటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది. అలాగే దివ్యాంగులకు వయోపరిమితిలో పదేళ్ల మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తుకు రూ. 1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రిజర్వేషన్ క్యాటగిరీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుకు గడువు 2024 జనవరి 31 నుంచి 2024 మార్చి 1 వరకూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా, వాయిస్ టెస్ట్ ఇలా వివిధ దశల్లో నిర్వహిస్తారు. వీటన్నింటిలో మంచి ప్రతిభ కనబరిచిన వారితో తుది జాబితాను విడుదల చేసి నియమిస్తారు.

పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు..

స్క్రీనింగ్ టెస్ట్‎కు సంబంధించిన హాల్‌టికెట్‌‎ను 2024 మార్చి 15 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష 2024 ఏప్రిల్ 13న ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‎లో అర్హత సాధించిన వారికి మూడు పేపర్ల రాత పరీక్ష ఉంటుంది. ప్రతి పేపర్‎కు వంద మార్కులు చొప్పున ప్రశ్నా పత్రం రూపొందిస్తారు. ఒక్కొక్క పేపర్ రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. పరీక్ష కేంద్రాలు గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖలో ఉంటాయి.ఈ పరీక్షలకు సంబంధించిన అభ్యంతరాలను 2024 ఏప్రిల్ 18 న స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..