AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: వల బరువెక్కడంతో పెద్ద చేపలు పడ్డాయని సంతోషపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!

సాధారణంగా మత్స్యకారులకు ఎదురయ్యే అత్యంత సహజమైన సవాళ్లు అనేకం ఉంటాయి. చేపల వేటకు వెళ్లిన సమయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయ్. అందులోనూ తీరం నుంచి ఐదు కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్తే.. ఖరీదైన, ఔషద గుణాలు ఉన్న చేపలు దొరికే అవకాశం ఉంటుంది.

AP News: వల బరువెక్కడంతో పెద్ద చేపలు పడ్డాయని సంతోషపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!
Fishing Net
Eswar Chennupalli
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 16, 2024 | 12:00 PM

Share

సాధారణంగా మత్స్యకారులకు ఎదురయ్యే అత్యంత సహజమైన సవాళ్లు అనేకం ఉంటాయి. చేపల వేటకు వెళ్లిన సమయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయ్. అందులోనూ తీరం నుంచి ఐదు కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్తే.. ఖరీదైన, ఔషద గుణాలు ఉన్న చేపలు దొరికే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతికూల పరిస్థితులు కూడా మత్స్యకారులను సవాల్ చేస్తాయి. బయటకు ప్రశాంతంగా కనిపించే సముద్రం ఒక్కోసారి అల్లకల్లోలానికి గురవుతుంది. ముఖ్యంగా ఆటుపోట్లు సమయంలో అయితే సముద్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ సమయంలో వేట కొనసాగడం చాలా కష్టం కానీ వేరే ఆధారం ఉండదు కాబట్టి సగటు మత్స్యకారుడికి వేటకు వెళ్లడం తప్పనిసరి అవుతుంది.

వలలో తిమింగలం..

రాంబిల్లి మండలం వాడపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు సోమవారం వేటకు వెళ్లారు. కాసేపటికి వల బరువుగా మారడంతో వాళ్లకు పట్టరాని ఆనందం వెల్లువిరిసింది. పెద్ద సంఖ్యలో చేపలు పడ్డాయని, అందులోనూ అక్కడ దొరికే చేపలకు భారీ గిరాకీ ఉంటుందని తెగ ఆనందపడ్డారు. ఇక ఎక్కువసేపు వేట కూడా అవసరం లేదనుకున్నారు. వెంటనే అతికష్టంపై వలను వెనక్కి తీసుకొచ్చి వేగంగా ఒడ్డుకు చేరుకున్నారు. వెంటనే ఎలాంటి చేపలు పడ్డాయో చూడాలన్న ఆసక్తితో.. వలకేసి ఓ లుక్కేస్తే.. షాక్ అయినంత పనైంది ఆ మత్స్యకారులకు. ఆ వలలో చేపల బదులు భారీ తిమింగలం కనిపించింది. అది కూడా ప్రాణాలతోనే ఉండడంతో మరింత షాక్‌కు గురయ్యారు. ఏం చెయ్యాలో పాలుపోక ప్రాణంతో ఉన్న ఆ తిమింగలాన్ని సముద్రంలోకి తిరిగి పంపించేందుకు ప్రయత్నించారు. కానీ అది తిరిగి లోపలకు వెళ్లలేకపోయింది. దాన్ని ఎలా తిరిగి నీటిలోకి పంపించాలో తోచక మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈలోగానే ఆ తిమింగలం ప్రాణాలు విడిచింది. దీంతో మత్స్యకారులు కూడా తీరని ఆవేదనకు గురై.. అక్కడ నుంచి నిరాశగా వెనక్కి తిరిగారు.

Whale