Chandrababu: చంద్రబాబును అప్పటివరకు సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దు.. క్వాష్ పిటీషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

|

Sep 13, 2023 | 11:59 AM

స్కిల్ డవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో సరైన సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకూ

Chandrababu: చంద్రబాబును అప్పటివరకు సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దు.. క్వాష్ పిటీషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
Chandrababu
Follow us on

Chandrababu Naidu Arrest: స్కిల్ డవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీలో హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో సరైన సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకూ ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13, ఐపీసీ 409లు చెల్లవని.. రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇటు చంద్రబాబు.. అటు సీఐడీ తరుపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 19కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే, సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు కోరగా.. సోమవారం (సెప్టెంబర్ 18) వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఏపీహైకోర్టు ఆదేశించింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా.. చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని ఆయన తరపున లాయర్లు కోరారు. యాంటీ కరప్షన్‌ యాక్ట్ సెక్షన్‌ 13 ఐపీసీ 409 చెల్లవని, సాక్ష్యాలు లేకున్నా రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో చంద్రబాబు లాయర్లు వివరించారు. అయితే, ఆధారాలతో రిపోర్టు ఇచ్చామని సీఐడీ తరపు లాయర్లు న్యాయస్థానానికి వాదనలు వినిపించారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే కేసు ప్రాథమిక దశలో ఉందని.. కౌంటర్ దాఖలుకు టైమ్ కావాలని ఏఏజీ సుధాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు. కోర్టు నెం 4లో చంద్రబాబు కేసులో 17 ఏ పై పోటాపోటీ వాదనలు కొనసాగాయి. అనంతరం ధర్మాసనం కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో పూర్తి వాదనలు వినాల్సి ఉందని.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ ధర్మాసనం పేర్కొంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంపై చంద్రబాబు తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారించిన ధర్మాసనం పూర్తి వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది..  ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..