Jagananna Thodu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల వారికి ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిరుపేదలకు మేలు జరిగే విధంగా స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan). ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇక జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మూడో విడత (Third instalment) రుణాలను ముఖ్యమంత్రి జగన్ జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు జగన్. 5.10 లక్షల మందికి వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనన్నారు. రూ. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, తొలి రెండు విడతల వడ్డీ రూ. 16.16 కోట్లు లబ్దిదారులకు జమ చేయనుంది జగన్ ప్రభుత్వం.
మొదటి విడతలో విడతలో 5.35 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందించింది ప్రభుత్వం. మూడో విడతతో కలిపి మొత్తం 14.16 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుందని అంచనా. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి రుణాలను అందించనున్నారు. లబ్దిదారులకు ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణాలను అందించనున్నారు. 2020, నవంబర్ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా ఒక్కో లబ్దిదారునికి రూ.10 వేల చొప్పున రుణాలను అందిస్తోంది. ఈ రుణం పొందిన వ్యాపారి 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు చెల్లిస్తోంది.
ఇవి కూడా చదవండి: