
మొంథా తుఫాన్ తీరం దాటింది. ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు, రెస్క్యూటీమ్స్ సాహసం, అన్ని శాఖల సమన్వయం..ప్రజలకు రక్షణ కవచంలా నిలిచాయి. సీఎం చంద్రబాబు RTGS నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. గ్రామ-వార్డు సచివాలయం సిబ్బందిని ఆరా తీశారు. ఒకేసారి 25వేల మంది టెలికాన్ఫరెన్స్ మాట్లాడి క్షేత్ర స్థాయిలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 12 గంటల పాటు ఏకధాటిగా టెలికాన్ఫరెన్సులు, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లతో తుపాను ప్రభావాన్ని పర్యవేక్షించారు సీఎం చంద్రబాబు. విరిగిపడిన చెట్లను రియల్ టైమ్‌లో తొలగిస్తున్న సిబ్బందిని అభినందించారు. యుద్ధప్రాతిపదికన కరెంట్ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు.12 గంటల పాటు ఏకధాటిగా నిరంతరం సమీక్షలు నిర్వహించారు సీఎం చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలోనే తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు.
ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలని , కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని ఆదేశించారు.కాల్వలు, చెరువులకు గండిపడకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.విజయవాడ, ఏలూరు, భీమవరంపై ఫోకస్ చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలన్నారు
కాగా.. తుఫాన్ తీరం దాటాక తదుపరి పరిణామలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది.. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా నివారించగలగడంలో విజయం సాధించిన ప్రభుత్వం.. నష్ట నివారణ చర్యలపై ఫోకస్ చేసింది. పడిపోయిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధీకరణ, రోడ్ల క్లియరెన్స్ పై దృష్టి సారించింది. యుద్ధ ప్రాతిపదికన అన్నింటిని పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చింది. గత ఐదురోజులుగా ఉపాధికి దూరమైన మత్స్యకార కుటుంబాలకు ఐదు వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికను అధికారులు .. ప్రభుత్వానికి అందజేశారు.
ఈ క్రమంలో బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నేడు జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి కలెక్టర్ అహ్మద్ ఖాన్ సెలవు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది.
మంత్రి నారాలోకేష్ రాత్రంతా సచివాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తుపాన్ బాధిత ప్రాంతాల్లో పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత ఇంకా తగ్గలేదు కాబట్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. CM చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..