AP New SEC: ఏపీ కొత్త ఎస్ఈసీ ఎవరు..? గవర్నర్‌కు మూడు పేర్లు సిఫార్సు ప్రభుత్వం.. వారు ఎవరంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎస్‌ఈసీ కోసం జగన్ సర్కార్ .. గవర్నర్‌కు మూడు పేర్లు సిఫార్సు చేసింది. మాజీ సీఎస్ నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు సిఫార్సులో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎస్‌ఈసీ కోసం జగన్ సర్కార్ .. గవర్నర్‌కు మూడు పేర్లు సిఫార్సు చేసింది. మాజీ సీఎస్ నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు సిఫార్సులో పేర్కొంది. ఈ నెల 31తో ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం ముగియనుంది. వీరిలో కూడా సాహ్నీకి బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఏపీ సీఎం జగన్‌ను ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆమెకు నెలకు రూ. 2.5 లక్షల వేతనంతో అదనపు సిబ్బందిని ప్రభుత్వం కేటాయిచింది. రెండేళ్లపాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని పదవీకాలం ఉంటుంది. కాగా ఎస్‌ఈసీ విషయంలో సీనియార్టీ, సమర్థత ఆధారంగా నియామకం ఉంటుందని సమాచారం. ఇందులో ప్రభుత్వ ఆసక్తిని కూడా గవర్నర్ పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. మార్చి 31 లోగా కొత్త ఎస్ఈసీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
కాగా ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు.. ఏపీ సర్కార్ మధ్య తారాస్థాయిలో అభిప్రాయ బేధాలు నెలకున్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆ గ్యాప్ కొనసాగుతుంది. అటు ప్రభుత్వంతో పాటు ఇటు నిమ్మగడ్డ కూడా పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కారు. మధ్యలో నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీగా నియమించింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్లి విజయం సాధించి నిమ్మగడ్డ తిరిగి పదవి చేపట్టారు.
Also Read: COVID Vaccine: కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్
Revanth Reddy Corona Positive: రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్.. స్వయంగా ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ