AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఆంధ్రప్రదేశ్‏లో మళ్లీ లాక్‏డౌన్ ?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఎంటంటే..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించగా..

Fact Check: ఆంధ్రప్రదేశ్‏లో మళ్లీ లాక్‏డౌన్ ?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. ఎంటంటే..
Andra Pradesh
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2021 | 5:32 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్‏డౌన్ విధానం అమలు చేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ.. కరోనా విజృంభిస్తుంది. గత మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన కొవిడ్ కేసులు.. ఒక్కసారిగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని కొన్ని మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని.. అందుకు కావాల్సిన జీవో జారీ చేసిందని గత కొద్దిరోజులుగా నెట్టింలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందులో కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లుగా ప్రకటన జారీ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. వీలు  ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరోసారి అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందని..  దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసిందని.. అంతేకాకుండా.. షాపింగ్ మాల్స్, పరిశ్రమల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, చేతులను శుభ్రం చేసుకోడానికి శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఆ ఉత్తర్వుల్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. . అలాగే, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించి, భౌతికదూరం నిబంధనలు పాటించాలని… ఈ క్రమంలోనే మార్చి 23 నుంచి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. లేకపోతే.. భారీగా జరిమానా కట్టాల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది.  గ్రామీణ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించకుండా తిరిగితే రూ.500, పట్టణాల్లోని వ్యక్తులు రూ.1,000 వసూలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా స్పందించింది. అందులో ” ఈ వీడియో జూన్ 2020 నుంచి ఇప్పటి వరకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్‏లో కోవిడ్-19 ప్రేరిత లాక్‏డౌన్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ.. కోవిడ్ మార్గదర్శకాలను పాటించండి. కానీ ఇలాంటి రూమర్స్ మాత్రం నమ్మకండి”.. అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వీట్..

Also Read:

AP New SEC: ఏపీ కొత్త ఎస్ఈసీ ఎవరు..? గవర్నర్‌కు మూడు పేర్లు సిఫార్సు ప్రభుత్వం.. వారు ఎవరంటే..?