AP Anganwadis: అంగన్వాడీలకు సీరియస్ వార్నింగ్.. వేటుకు రంగం సిద్ధం..!

|

Jan 02, 2024 | 5:06 PM

పలు రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తూ వినతి పత్రాలను అందిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. మరోవైపు, విధుల్లో చేరాలని ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కూడా వారు పట్టించుకోలేదు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం వారికి డెడ్ లైన్ విధించింది. జీతాలు పెంచలేమని తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ విషయం

AP Anganwadis: అంగన్వాడీలకు సీరియస్ వార్నింగ్.. వేటుకు రంగం సిద్ధం..!
Anganwadis
Follow us on

ఆంధ్రప్రదేశ్, జనవరి02; ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె మరింత ఉధృతంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో గత 22 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమ్మెతో రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది చిన్నారులు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్‌ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు ఐదు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే డిమాండ్ల సాధన కోసం విడతల వారీగా ఆందోళన ఉధృతం చేస్తున్న అంగన్‌వాడీలు… రేపు జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్‌ స్పందించింది.. అంగన్‌వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. జనవరి5 లోపు సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని ఆదేశించింది. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమ్మె వల్ల బాలింతలు, చిన్న పిల్లలు ఇబ్బందిపడుతున్నారని, అంగన్‌వాడీలు దీన్ని దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని కోరారు.

తొలుత అంగన్‌వాడీ సిబ్బంది 11 డిమాండ్‌లకు గాను నాలుగు డిమాండ్‌లను ప్రభుత్వం ఆమోదించి జిఓ విడుదల చేసింది. అయితే తమ ప్రధాన డిమాండ్‌ అయిన జీతాల పెంపు, గ్రాట్యుటీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని నిరవధిక సమ్మెలో ఉన్న లక్ష మందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఇప్పుడు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు. మినీ వర్కర్లందరినీ పూర్తి స్థాయి కార్మికులుగా పదోన్నతి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అందుకు సంబంధించి జిఓ విడుదల చేయకపోవడంతో అంగన్‌వాడీ సంఘాలు నమ్మేందుకు సిద్ధంగా లేవు.

పలు రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తూ వినతి పత్రాలను అందిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. మరోవైపు, విధుల్లో చేరాలని ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కూడా వారు పట్టించుకోలేదు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం వారికి డెడ్ లైన్ విధించింది. జీతాలు పెంచలేమని తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ విషయం తమ పరిధిలో లేదన్నది.

ఇవి కూడా చదవండి

అంగన్‌వాడీ సిబ్బంది, కార్యకర్తలతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు వార్నింగ్ ఇస్తూ అంగన్వాడీ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. 5వతేదీలోగా విధుల్లో చేరాల్సిందేనని తేల్చి చెప్పింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..