Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరే శుభవార్త.. అమల్లోకి కొత్త నిర్ణయం.. ఇకపై నో టెన్షన్
రైతులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. వెబ్ ల్యాండ్ వివరాలను లాక్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చింది. దీని వల్ల మీ భూమికి రక్షణ ఉంటుంది. ఇతరులు మీకు తెలియకుండా మ్యూటేషన్ చేయాలని చూసినా మెస్సేజ్ వస్తుంది. దీని వల్ల కబ్జాలకు చెక్ పడనుంది.

రైతులకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు భూములు కబ్జా, ఆక్రమణలు లాంటి వాటి బారిన పడకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వెబ్‌ల్యాండ్‌లో రికార్డులకు లాకింగ్ సిస్టమ్ కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఒకసారి వెబ్‌ల్యాండ్ రికార్డులకు లాక్ వేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ భూమిని మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ చేయాలన్నా మీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 1బీ, అడంగల్ వంటి వాటిని లాక్ చేసుకోవచ్చు.
కబ్జా చేస్తే మీ ఫోన్‌కు మెస్సేజ్
మీ భూమిని ఎవరైనా కబ్జా చేసినా లేదా భూమిని తారుమారు చేసినా మీ ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. అయితే కౌలు దారులకు ఈ సదుపాయం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనిని అమల్లోకి తెచ్చారు. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రికార్డ్ లాకింగ్ సిస్టమ్ అనే దానిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేఏశారు. ఈ లాకింగ్ సిస్టమ్ ఉపయోగించుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలి. అక్కడ వీఆర్వోను సంప్రదించాలి. మీ ఐరిస్, బయోమెట్రిక్, ఫేస్ రికగ్నేషన్ వంటి వివరాలతో వీఆర్వో లాకింగ్ చేస్తారు. ఆధార్‌తో వెబ్ ల్యాండ్‌లో భూమి లింక్ అయిందా.. లేదా అనేది చూస్తారు. ఆధార్, వెబ్ ల్యాండ్‌లో పేరు ఒకేలా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు లాకింగ్ ఆప్షన్ ఉంటుంది. రెండూ ఒకలా లేకపోతే మీ మొబైల్‌కు మెస్సే్జ్ వస్తుంది. అయితే ఆధార్‌తో లింక్ చేస్తే 90 రోజుల తర్వాత లాకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లాక్ తీసుకోవాలంటే భూమిని విక్రయించే సమయంలో విక్రయంచేవారు అనుమతి తీసుకోవాలి. ఇక పట్టదారుడు చనిపోతే కుటుంబసభ్యులు అన్ లాక్ చేయడానికి అంగీకారం చెప్పాల్సి ఉంటుంది.
