AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గతకొన్ని రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత గవర్నర్ తిరిగి విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా గవర్నర్‌కు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
దీంతో గవర్నర్‌ను వైద్యులు వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. గవర్నర్‌తో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాద్ బయలు దేరారు. ఇక గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగానే గవర్నర్ దంపతులు హైదారాబాద్ వెళుతున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈనెల 15న గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన 17న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈనెల 20, 22 తేదీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో 23న ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన విషయం తెలిసిందే.
Also Read: Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో