AP PRC: ఉద్యోగ సంఘాలకు షాక్.. రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్.. PRC సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ..

పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమైన వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం  జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు..

AP PRC: ఉద్యోగ సంఘాలకు షాక్.. రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్.. PRC సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ..
Ap Employees

Updated on: Dec 02, 2021 | 7:15 PM

పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమైన వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం  జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది సర్కారు. PRC సహా ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. PRC నివేదిక.. DA బకాయిలు, CPS రద్దు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాల వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నాయి ఉద్యోగ సంఘాలు. అటు నిన్ననే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీసులిచ్చాయి ఉద్యోగసంఘాలు.

డిసెంబరు 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అటు పీఆర్సీపై ఉద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు మంత్రి బాలినేని. సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని, తప్పకుండా ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..