జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ల్యాప్‌టాప్‌ల పంపిణీపై కసరత్తు.. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

|

Sep 11, 2021 | 7:34 PM

జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పధకాల లబ్దిదారులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది...

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ల్యాప్‌టాప్‌ల పంపిణీపై కసరత్తు.. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే!
Students
Follow us on

ఏపీలో జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పధకాల లబ్దిదారులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. విద్యార్ధులకు డబ్బులు కంటే ల్యాప్‌టాప్‌లు ఇవ్వడమే మంచిదని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని కోరుకున్నవారికి మాత్రమే వర్తింపజేయనుంది.

ఇదిలా ఉంటే.. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ రూ.100 కోట్ల పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను జ్యుడీషియల్ రివ్యూకు పంపించింది. న్యాయ సమీక్ష పూర్తయిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఈ పధకాన్ని అమలులోకి తీసుకురానుంది.

బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, ఆధునిక కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవనుంది. ల్యాప్ టాప్‌ల సరఫరా కోసం బిడ్లు దాఖలు చేయాల్సిందిగా కాంట్రాక్టర్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కోరింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నా సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా apjudicialpreview@gmail.comకు పంపాలని లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, సుమారు 5.50 లక్షలకు పైగా అమ్మఒడి, వసతి దీవెన లబ్దిదారులు ల్యాప్‌టాపులు కావాలని కోరినట్లు తెలుస్తోంది.

Also Read: