Andhra: వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్.. మిస్ చేస్తే మోత మోగిపోతుంది

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపైన భారీ రాయితీని ఇస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన గడువు ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత క్రమబద్ధీకరణ రుసుములు భారీగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో ఈ నెల 23వ తేదీలోగా ఎన్ఆర్ఐ వినియోగించుకునే వారు ముందుకు వస్తే ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పొందే అవకాశం ఉంటుంది.

Andhra: వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్.. మిస్ చేస్తే మోత మోగిపోతుంది
Andhra Pradesh

Edited By:

Updated on: Jan 21, 2026 | 8:07 AM

ఏపీ సర్కార్ ప్రకటించిన ఎల్ఆర్ఎస్ ఈనెల 23తో ముగిసిపోనుంది. ఇప్పటిదాకా ఏపీవ్యాప్తంగా ఈ స్కీం కింద 52,470 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. అయితే మరో 25 వేల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశించిన గడువు పెంచాలని ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం గడువు పెంపుపైన ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. 2025 జూలై 26వ తేదీన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకంపైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. దీని ద్వారా 75 వేల మంది ప్రయోజనం కలగడంతో పాటుగా ప్రభుత్వానికి దాదాపు 600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. జనవరి 23వ తేదీలోగా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే వారికి ఓపెన్ స్పేస్ చార్జీల్లో ప్రభుత్వం 50 శాతం మేర రాయితీని కూడా ప్రకటించింది.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

ఈ నేపథ్యంలో ఓపెన్ స్పేస్ చార్జీల కింద ఫ్లాట్ మొత్తం విలువలో 14 శాతానికి బదులు ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన తర్వాత ప్లాట్ల క్రమ వర్గీకరించుకోవాలంటే ఓపెన్ స్పేస్ చార్జీలు 14 శాతం కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విలువల ఆధారంగా ఆ రోజు చెల్లింపులు చెల్లించాలి. చార్జీలు ఇతర రుసుముల మొత్తంపైన మళ్ళీ అపరాధ రుసుములు భరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్

ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో పూర్తి సమాచారం ఇవ్వకపోవడం సమస్యగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 9,245 దరఖాస్తులు సంబంధించిన వాటిల్లో అవసరమైన దస్తావేజులు, వివరాలు లేని కారణంగా వాటిని పక్కన పెట్టినట్టు సమాచారం.

ఇది చదవండి: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి