AP Secretariat: డిమాండ్లు వినిపించేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు.. ఎట్టకేలకు దిగొచ్చిన ఏపీ సర్కార్..

ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ కాబోతోంది. జేఏసీ నేతలకు జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌ ఫోన్‌ చేశారు. దీంతో..

AP Secretariat: డిమాండ్లు వినిపించేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు.. ఎట్టకేలకు దిగొచ్చిన ఏపీ సర్కార్..
Andhra Pradesh Secretariat

Updated on: Nov 11, 2021 | 9:47 AM

ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ కాబోతోంది. జేఏసీ నేతలకు జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌ ఫోన్‌ చేశారు. దీంతో.. శాఖల వారీగా డిమాండ్లపై అధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మరోవైపు.. చర్చలు ఫలించకపోతే ఏం చేయాలనే దానిపై ఉద్యోగ సంఘాలు రెడీ అవుతున్నాయి. ఈ సాయంత్రం సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు జేఏసీ నేతలు.

ఏపీ సచివాలయంలో హీట్ పెరుగుతోంది. పీఆర్సీ ఇవ్వరా.. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా.. అంటూ ఏకంగా నిరసనకు దిగారు ఉద్యోగ సంఘం నేతలు. నిన్న సుమారు ఐదు గంటలుగా సెక్రటేరియట్‌లో బైఠాయించారు. పీఆర్సీపై క్లారిటీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.

పదకొండవ పీఆర్సీ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పీఆర్సీ ఇచ్చి ఎనిమిదేళ్లు పూర్తైంది. పే రివిజన్ చేయకపోతే.. చిన్న ఉద్యోగులు ఎలా బతకాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసి సీఎంని గెలిపిస్తే.. మా సమస్యలపై పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు.

ఉద్యోగ సంఘాల జేఏసీ లీడర్ బండి శ్రీనివాసరావు సెన్షేషనల్‌ కామెంట్స్ చేశారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాము కూడా ఓట్లేశామ్, ఇప్పుడు మాకేంటీ ఖర్మ అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పదకొండో పీఆర్సీ రిపోర్ట్‌ను బయటపెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు బొప్పరాజు.

పీఆర్సీ నివేదిక బయటపెట్టమంటే ఎందుకు భయపడుతున్నారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ రిపోర్ట్‌ను బహిర్గతం చేయడానికే భయపెడితే.. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటూ నిలదీస్తున్నారు. ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉద్యోగులంటే అంత చిన్నచూపా అంటూ ఫైరవుతున్నారు.

పీఆర్సీ ఇచ్చి 8ఏళ్లు గడిచిపోయాయ్. ధరలు విపరీతంగా పెరిగాయ్. మరి, చిన్న ఉద్యోగులు ఎలా బతకాలి అంటున్నారు. తమ ప్రశ్నలకు సీఎం అండ్ సీఎస్ ఆన్షర్ చెప్పాల్సిందే అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

5 గంటలపాటు నిన్న సెక్రటేరియట్‌లో బైఠాయించిన ఉద్యోగ సంఘాల నేతలు.. ఎట్టకేలకు వెనుదిరిగి వెళ్లిపోయారు. మరి ఇవాళ ప్రభుత్వంతో చర్చలు ఫలిస్తాయో.. లేక ఇంకేమైనా పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో ఈ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఫ్రీ..

Chanakya Niti: కష్టాల్లో ఉన్నారా.. ఇలా ధృ‌ఢంగా ఉండండి.. అదే మీ విజయానికి పూలబాట..

Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..