Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

|

Apr 01, 2022 | 5:55 AM

AP Group 1, 2 Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
Appsc
Follow us on

AP Group 1, 2 Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 292 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్‌సీ (APPSC) కి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ (Andhra Pradesh Govt) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ ప్రకటన విడుదల చేశారు. 110 గ్రూప్‌-1 పోస్టులు, 182 గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్‌సీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది.

కాగా.. గ్రూప్‌-1 కేటగిరీలో.. డిప్యూటీ కలెక్టర్లు, సీటీఓలు, జిల్లా రిజిస్ట్రార్‌లు, డీఎస్పీ పోస్టులతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు తదితర పోస్టులున్నాయి. గ్రూప్‌-2 కేటగిరీలో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, సహకార సొసైటీల అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు, సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు తదితర పోస్టులున్నాయి. వీటి అనుమతికి ఆదేశాలు ఇస్తూ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది.

Also Read:

Earthquake: గుంటూరు జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

ఏపీలో ‘పవర్‌’ ఫుల్‌ పాలిటిక్స్.. పేదలు, మధ్య తరగతికి కరెంట్ షాకేనా.? ఉత్పత్తి వ్యయమెంత జనాలపై భారమెంత.?