ఏపీ: ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. ఈ నెల 30 నుంచి దరఖాస్తు స్వీకరణ..

|

Jun 26, 2021 | 1:28 PM

ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది...

ఏపీ: ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. ఈ నెల 30 నుంచి దరఖాస్తు స్వీకరణ..
AP-Government-
Follow us on

ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. భార్యాభర్తలు, పరస్పర బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే ఈ నెల 30వ తేదీకి రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నవారు బదిలీలకు అర్హులని పేర్కొంది. అనధికారికంగా విధులకు గైర్హాజరులో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్నవారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు బదిలీకి అనర్హులని ప్రకటించింది. అలాగే గతంలో చేసుకున్న దరఖాస్తులు చెల్లవని స్పష్టం చేసింది.

మరోవైపు సెక్రటేరియట్‌లో పని చేసే జీవిత భాగస్వామి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు బదిలీ చేస్తారని తెలిపింది. అలాగే బదిలీ కోరుకునే జిల్లాలోని ఎయిడెడ్‌, లోకల్‌ బాడీ, రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్సిటీల్లో వారి జీవిత భాగస్వామి(స్పౌజ్‌) పనిచేస్తూ ఉండాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒక్కసారి మాత్రమే దరఖాస్తుకు అనుమతి ఇస్తామని.. అర్హత కలిగిన ఉపాధ్యాయులు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

బదిలీల షెడ్యూల్‌ ఇలా ఉంది…

  • జూన్‌ 30 నుంచి జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవాలని.. ఆ తర్వాత దాన్ని ప్రింట్ తీసి ఎంఈఓ లేదా డిప్యూటీ ఈఓకి అందజేయాలి.
  • జూలై 7 నుంచి 11 వరకు: దరఖాస్తుల పరిశీలన, డీఈఓకి సమర్పణ.
  • జూలై 12 నుంచి 17 వరకు: జిల్లా విద్యాధికారి దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 19న పాఠశాల విద్యా కమిషనర్‌కు సమర్పణ.
  • జూలై 20 నుంచి 26 వరకు: తుది జాబితాను రూపొందిస్తారు.
  • జూలై 29:  ప్రభుత్వానికి దరఖాస్తుల సమర్పణ, అనంతరం ఉత్తర్వులు జారీ

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!