ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరుచునేందుకు జగన్ సర్కార్ అనుమతిచ్చింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లను మినహాయించి.. ఇతర ఆహార దుకాణాలు, ఈటరీస్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరుచుకోవచ్చంది.
కాగా, కోవిడ్ కారణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించగా.. ఆ నిబంధనలు మార్చితో ముగిసిన విషయం విదితమే.
దీనితో ఏపీ హోటల్ అసోసియేషన్ అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార వేళల్లో మార్పులు చేసింది. మాస్క్ ధరించి, శానిటైజర్ వాడుతూ కోవిడ్ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.