ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్.. సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఈ నెల 14, 15, 16 తేదీలను సంక్రాంతి సెలవులుగా ప్రకటించిన ప్రభుత్వం.. వాటికి బదులుగా ఈ నెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులుగా ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, కరోనా కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నెలాఖరు దాకా ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది.
Also Read:
ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్.. కష్టం కాదు.!
ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..