AP News: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారునిగా జయప్రకాశ్‌సాయి.. అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి

|

Feb 16, 2022 | 11:41 AM

AP government: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్.. విజయవాడకు సలహాదారునిగా డా. జే జయప్రకాశ్‌సాయి (Jayaprakashsai) నియమిస్తూ

AP News: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారునిగా జయప్రకాశ్‌సాయి.. అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి
Jayaprakashsai
Follow us on

AP government: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్.. విజయవాడకు సలహాదారునిగా డా. జే జయప్రకాశ్‌సాయి (Jayaprakashsai) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేతనం లేకుండా స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన 2 సంవత్సరాల పాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ విజయవాడకు సలహాదారుగా జయప్రకాశ్‌సాయి సేవలందించనున్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లో భాగంగా అతన్ని నియమించినట్లు ఏపీ ప్రభుత్వం (AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌లో భాగంగా విజయవాడ అభివృ‌ద్ది కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రకు సలహాదారుగా డా.జె.జయప్రకాశ్‌సాయిని నియమించడానికి అనుమతినిచ్చింది.

ఈ మేరకు జయప్రకాశ్ సాయి విజయవాడలో 2 సంవత్సరాల పాటు స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన SBM(G) మిషన్ లో వేతనం లేకుండా నీరు – పారిశుధ్యం కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇతర డిపార్ట్‌మెంట్‌లు, ఎన్‌జిఓలు, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌, మెడికల్ రంగాలల్లో జయప్రకాశ్ సాయికి అపారమైన అనుభవం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ప్రకటనను విడుదల చేశారు.

కాగా.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారుగా నియమించడం పట్ల జయప్రకాశ్‌సాయి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి జయప్రకాశ్‌సాయి అభినందించి.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కోసం పాటుపడాలని సూచించారు.

Also Read:

AP Crime News: ఆటో ఎక్కిన బాలికపై డ్రైవర్ కన్ను.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా..

Big News Big Debate: TDP రాజీనామా సవాళ్లకు YCP ఇచ్చే ఆన్సరేంటి? హోదా ముగిసిన అధ్యాయమైతే అజెండాలోకి ఎందుకొచ్చింది?