తెలంగాణ మంత్రులు చేసి కామెంట్స్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వాన్నే కాదు పక్కనే ఉన్న మరో తెలుగురాష్ట్రంలోని జగన్ సర్కార్ ను కూడా కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలా మాట్లాడివుంటారని అన్నారు. వాళ్ళ రాజకీయాలతో ఏపీకి సంబంధం లేదన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల గురించి పట్టవని.. వారి ట్రాప్‌లో పడబోమని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ది ఎజెండా మాత్రమే కాదని సీఎం జగన్ కూడా అదే అలోచిస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివంటూ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవ చేశారు. 2014లో ప్రజలు చంద్రబాబుకు చివరి అవకాశం ఇచ్చారని.. 2019లోనే ఆయనకు చివరి ఎన్నికలు అయిపోయాయన్నారు. ప్రజలు ఆయనను రిజెక్ట్ చేసినా ఇంకా దింపుడుకళ్లం ఆశలున్నాయని.. 2023 లోనూ ఆయనకు పరాభవం తప్పదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
చంద్రబాబు కు 2019 లొనే చివరి ఎన్నికలు. 2014 లో ఆయనకు చివరి అవకాశం ఇచ్చారు ఏపీ ఓటర్లు. అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. రాష్ట్రం గురించి ఆలోచించకుండా తనవారి కోసం ఆలోచించారు. అంత పెద్ద పార్టీకి దరిద్రంగా 23 సీట్లు ఎందుకొచ్చాయో అర్థం చేసుకోవాలన్నారు. దింపుడు కళ్లెం అశాలగా 2024లో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఒక యువ నాయకుడు ఇలా చేసారని కడుపు మంటకోపం ఉంటుంది కదా. తన భార్య గురించి ఎవరూ ఏమీ అనలేదు. రాజకీయం కోసం కుటుంబసభ్యులను కూడా లెక్కచేయడు. ప్రజలు తనపై సింపతీ చూపించాలని అంటే ఎవరూ నమ్మరు. పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరిని అనాలి కాబట్టి నన్ను ఎంచుకున్నాడు కావచ్చు. పవన్ గురించి ఆలోచించి టైం వెస్ట్ చేసుకోదలుచుకోలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం