PRC: చ‌ర్చ‌లకు రండి.. మీరు మా శ‌త్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల సూచన..

|

Jan 27, 2022 | 3:51 PM

ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హా దారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎక్క‌డో కూర్చుని మాట్లాడితే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం రాద‌న్నారు.

PRC: చ‌ర్చ‌లకు రండి.. మీరు మా శ‌త్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల సూచన..
Follow us on

ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హా దారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎక్క‌డో కూర్చుని మాట్లాడితే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం రాద‌న్నారు. స‌మ్మెకు వెళ్ల‌డం సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని తెలిపారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమన్నారు. చ‌ర్చ‌ల‌కు ర‌మ్మ‌నే మేం కోరుతున్నామ‌ని స‌జ్జ‌ల వెల్ల‌డించారు. బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్ గా వ్యవహరించడం మంచిది కాదన్నారు.

అయినా చ‌ర్చ‌ల‌కు రాక‌పోవ‌డం బాధాక‌రం అని తెలిపారు. ప్ర‌భుత్వం నాలుగుమెట్లు దిగ‌డానికి సిద్ధంగానే ఉంద‌ని చెప్పారు. రెచ్చ‌గొట్టే మాట‌ల‌ను మేం ప‌ట్టించుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. అనాలోచితంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు. ఉద్యోగ సంఘాలు మొండివైఖ‌రితో వ్య‌వ‌హ‌రించొద్ద‌ని స‌జ్జ‌ల చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు మాకు శ‌త్రువులు కాద‌న్నారు.

అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడామన్నారు.పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. సీఎం జగన్ పాజిటీవ్ గా ఉండే వ్యక్తి అని.. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు.

ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు.

ఇవి కూడా చదవండి: Flying Cars: వావ్.. ఎగిరిపోవచ్చు… గాలిలో తేలే కార్లు వచ్చేస్తున్నాయోచ్..

Beetroot: క్యాన్సర్‌ను తరమికొట్టే దివ్య ఔషదం.. తాజా పరిశోధనలలో సరికొత్త నిజాలు..