AP Elections 2024: ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసేందుకు సిద్దంగా ఓటర్లు..

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సరిగ్గా 5.30 కి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. అనంతరం ఓటర్లుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ప్రజలు. ప్రజాస్వామ్య పండుగకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల జాతరకు తెరలేచింది. కాసేపట్లో పోలింగ్‌ షురూ కాబోతోంది. ఊరూవాడా ఎలక్షన్‌ జోష్‌ కన్పిస్తోంది. పల్లెపట్నం పండుగ వాతావరణం సంతరించుకుంది.

AP Elections 2024: ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసేందుకు సిద్దంగా ఓటర్లు..
Ap Elections
Follow us
Srikar T

|

Updated on: May 13, 2024 | 7:06 AM

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సరిగ్గా 5.30 కి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. అనంతరం ఓటర్లుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ప్రజలు. ప్రజాస్వామ్య పండుగకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల జాతరకు తెరలేచింది. కాసేపట్లో పోలింగ్‌ షురూ కాబోతోంది. ఊరూవాడా ఎలక్షన్‌ జోష్‌ కన్పిస్తోంది. పల్లెపట్నం పండుగ వాతావరణం సంతరించుకుంది. ఎన్నికల రణక్షేత్రంలో కీలక ఘట్టానికి వేళయ్యింది. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు రెడీ అయ్యారు ఏపీ జనం. నేతల భవితవ్యాన్ని EVMలలో నిక్షిప్తం చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పోలింగ్‌ బూత్‌లలో సకల సదుపాయాలూ కల్పించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అన్నిప్రాంతాల్లో మరి కొద్ది నిమిషాల్లో అనగా ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలు కాబోతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్‌ ముగుస్తుంది.

ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 12 వేల 438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె లాంటి 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో వందశాతం మేర వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. లక్షా 60 వేల EVMలు వినియోగిస్తోంది ఈసీ. వాటి పనితీరును రెండుసార్లు పరిశీలించారు అధికారులు. ఎన్నికల ప్రక్రియను సాఫీగా పూర్తిచేసేందుకు 5 లక్షల 26 వేల మంది సిబ్బందిని ఈసీ వినియోగిస్తోంది. ఇందులో 3 లక్షల 30 వేల మంది పోలింగ్ విధుల్లో, లక్షా 6 వేల మంది బందోబస్తులో పాల్గొంటారు. సెల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించబోమని ఈసీ స్పష్టం చేసింది. పోల్ డే మానిటరింగ్ సిస్టం అనే వెబ్ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కదలికనూ తెలుసుకునేలా ఏర్పాట్లు చేసింది.

లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది, అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలో అత్యధికంగా 46 మంది, చోడవరంలో అత్యల్పంగా ఆరుగురు పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్ధులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రెండు కంటే ఎక్కువ బ్యాలట్ యూనిట్లు వినియోగించనున్నారు. మొన్నటిదాకా ప్రచారంతో హోరెత్తించిన నేతలు చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. గెలుపు బావుటా ఎగురవేసేందుకు ఆఖరి అస్త్రాలు సంధిస్తున్నారు. నిన్న రాత్రి వరకూ ప్రలోభాల పరంపర కొనసాగింది. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు చివరి క్షణం దాకా ప్రయత్నించారు. ఎన్నికల్లో నిన్నటి దాకా ఒక ఎత్తు.. ఇవాళ మరో ఎత్తు. ఎలక్షన్‌ వార్‌లో పోల్‌ మేనేజ్‌మెంట్‌ అత్యంత కీలకం. ఇప్పుడదే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను బూత్‌ వరకూ తీసుకొస్తున్నాయి. వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా వాహనాలను సమకూరుస్తున్నారు. బూత్‌ల వారీగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ను అత్యంత పకడ్బందీగా చేపడుతున్నారు లీడర్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..