AP Weather: ఓర్నీ.. పోలింగ్ డే రోజు పిడుగులతో వర్షాలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే

బిగ్ అలెర్ట్. ఏపీలో పోలింగ్ డే రోజు ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఏయే జిల్లాల్లో వర్షాలు పడతాయి.. టోటల్ వెదర్ రిపోర్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి....

AP Weather: ఓర్నీ.. పోలింగ్ డే రోజు పిడుగులతో వర్షాలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదే
Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: May 12, 2024 | 9:07 PM

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రేపు కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయని ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లే ఓటర్లు స్థానిక వాతావరణాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు.

సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 31.2 మిమీ, కోనసీమ జిల్లా ఆలమూరులో 30.2 మిమీ, తాటపూడిలో 28.7 మిమీ, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 26 మిమీ, మన్యం జిల్లా పాచిపెంటలో 22, అనకాపల్లి జిల్లా పరవాడలో 21.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 50 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడినట్లు తెలిపారు.

మరోవైపు సోమవారం 18 మండలాల్లో వడగాల్పులతో పాటు మిగిలినచోట్ల ఎండ తీవ్రతగా ఉండే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. విజయనగరం 8, పార్వతీపురంమన్యం 8, ఏలూరు భీమడోలు, కృష్ణా ఉయ్యూరులో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా గాజులపల్లెలో 41.9°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.4°C, ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో 41.3°C, కర్నూలు జిల్లా కామవరం, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 41.2°C, అనంతపురం జిల్లా కోమటికుంట్లలో 41°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ప్రజలు వీలైనంతవరకు ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..