AP Election: స్ట్రాంగ్‌రూమ్‌లకు మరింత పటిష్టభద్రత.. 2 కి.మీ. పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ అమలు

|

May 21, 2024 | 7:39 AM

శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌటింగ్ చేపట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌ను ఎన్నికల అధికారులు పరిశీలించారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. భద్రత విషయంలో పోలీసులకు సూచనలు చేశారు.

AP Election: స్ట్రాంగ్‌రూమ్‌లకు మరింత పటిష్టభద్రత.. 2 కి.మీ. పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ అమలు
Strong Room
Follow us on

శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌటింగ్ చేపట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌ను ఎన్నికల అధికారులు పరిశీలించారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. భద్రత విషయంలో పోలీసులకు సూచనలు చేశారు.

చెదురు ఘటనలు మినహా ఏపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర కట్టుదిట్టమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదటి సర్కిల్‌కి సీఏపీఎఫ్‌ గార్డులు.. రెండో సర్కిల్‌కి పోలీసు బృందం, మూడో సర్కిల్‌ భద్రత కోసం జిల్లాల కార్యనిర్వాహక దళానికి చెందిన గార్డులు మోహరించారు. ప్రత్యేక బలగాలు 24 గంటటూ విధుల్లోనే ఉండడంతోపాటు సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌ని పర్యవేక్షిస్తారు అధికారులు.

ఇక.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు మరింత పటిష్టభద్రత కల్పించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, విశాఖ లోక్‌సభ స్థానానికి సంబంధించిన ఈవీఎంలను ఆంధ్రా యూనివర్సిటీకి తరలించి.. స్ట్రాంగ్ రూమ్‌లకు తాళం వేశారు. పోలీసు బలగాల పహారాలో భద్రపరచారు. స్ట్రాంగ్‌ రూమ్స్ దగ్గర సీసీ కెమెరాల నిరంతర నిఘాతోపాటు.. కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తాజాగా ఆంధ్ర యూనివర్సిటీకి రెండు కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌గా ప్రకటించారు విశాఖ పోలీస్ కమిషనర్. అంతే కాకుండా స్ట్రాంగ్ రూమ్స్ పరిధిలో డ్రోన్‌లు, బెలూన్లు ఎగరేయకుండా నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. పోలీస్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..