ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరోసారి లేఖ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించాలంటూ విజ్ఞప్తి..
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి లేఖ రాశారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు...

Nimmagadda Ramesh Kumar Letter: ఏపీ సీఎస్ నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి లేఖ రాశారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని.. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహాయక సహకారాలు అందించాలని లేఖలో పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో కూడా స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు సీఎస్‌తో పాటు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. లేఖలో కోర్టు ఆదేశాలను ప్రస్తావించిన నిమ్మగడ్డ.. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఇక ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గత నెల 23వ తేదీన సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ రాసిన సంగతి విదితమే.
Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..
