ఏపీః టెన్త్ పాసైన విద్యార్ధులకు అలెర్ట్.. ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్.. వివరాలివే..

|

Aug 24, 2021 | 7:40 AM

ఏపీ పదో తరగతి విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. 2020-21 విద్యా సంవత్సరంలో టెన్త్ పాసైన స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను..

ఏపీః టెన్త్ పాసైన విద్యార్ధులకు అలెర్ట్.. ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్.. వివరాలివే..
Students
Follow us on

ఏపీ పదో తరగతి విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. 2020-21 విద్యా సంవత్సరంలో టెన్త్ పాసైన స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను జారీ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. www.bse.ap,gov.in వెబ్‌సైట్‌ ద్వారా రూ.80 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇవాళ్టి నుంచి ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

మరోవైపు 2004వ సంవత్సరం తర్వాత 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు సైతం మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్ధులకు తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం.

ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు గడువు పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటించారు. ఇంటర్‌ ఫస్టియర్ అడ్మిషన్లను చేపట్టిన బోర్డు.. దరఖాస్తులను ఈ నెల 13 నుంచి 23 వరకు స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే చాలామంది స్టూడెంట్స్ గడువు పొడిగించాలని అభ్యర్ధించడంతో దరఖాస్తు గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది.

`