AP Summer Holidays: ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. మే 9వ తేదీ నుంచి వేసవి సెలవులు.!
ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. మే9వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉండనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది...
ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. మే9వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉండనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే9 వరకు జరగనున్నాయి. ఇక పరీక్షలు పూర్తి కాగానే సెలవులను ప్రకటించనుంది విద్యాశాఖ. అటు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు జరగనున్నాయి. అవి పూర్తయిన వెంటనే వారికి సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఇదిలా ఉంటే.. 2022-2023 విద్యా సంవత్సరాన్ని జూలై 4 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ నేపధ్యంలో జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. కాగా, ఈ అంశంపై రెండు లేదా మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.