10th Inter Exams : టెన్త్, ఇంటర్ ప‌రీక్ష‌ల నిర్వాహణపై సీఎంతో ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌లేదు : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్

|

Jun 18, 2021 | 12:17 AM

ఆంధ్ర ప్రదేశ్ లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల తేదీల‌పై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ చెప్పారు...

10th Inter Exams : టెన్త్, ఇంటర్ ప‌రీక్ష‌ల నిర్వాహణపై సీఎంతో ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌లేదు : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్
Adimulapu Suresh
Follow us on

AP Education Minister Adimulapu Suresh : ఆంధ్ర ప్రదేశ్ లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల తేదీల‌పై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ చెప్పారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో గురువారం సీఎం జ‌గ‌న్‌ అధ్య‌క్ష‌త‌న విద్యాశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష ముగిసిన అనంత‌రం అందులో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. ప‌రీక్ష‌ల‌పై మొద‌టి నుంచి త‌మ‌ వైఖ‌రి ఒక్క‌టే అని మంత్రి వివ‌రించారు. ఈ రివ్యూ మీటింగ్ లో ఏపీలో నూతన విద్యావిధానం అమలుకోసం కార్యాచరణ రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తోన్న నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సరికొత్త సిస్టమ్ వల్ల ఉపాధ్యాయులు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందన్నారు. ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో దీని గురించి అవగాహన, చైతన్యం కలిగించాలని సీఎం విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించారు.

నూతన విద్యావిధానంవల్ల జరిగే మేలును టీచర్లకు, విద్యార్థులకు వాళ్ల తల్లిదండ్రులకు వివరించాలని సీఎం ఆదేశించారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలని స్పష్టంచేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు – నేడు కింద భూమి కొనుగోలు చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని సీఎం అధికారులకు ఆదేశించారు.

Read also :  KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ