Exams: ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయ్.. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై మరింత క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్..

AP Education Minister Adimulapu Suresh: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతోపాటు.. పలు ప్రవేశపరీక్షలను సైతం ప్రభుత్వాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో

Exams: ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయ్.. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలపై మరింత క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్..
Adimulapu Suresh

Updated on: Jun 05, 2021 | 12:24 PM

AP Education Minister Adimulapu Suresh: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతోపాటు.. పలు ప్రవేశపరీక్షలను సైతం ప్రభుత్వాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లను నిర్వ‌హించి తీర‌తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ స్ప‌ష్టం చేశారు. కరోనావైరస్ ఉద్ధృతి త‌గ్గాక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వెల్లడించారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌డం లేద‌ని.. కేవలం ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయని ఆయ‌న తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు దీనిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయ‌ంటూ మంత్రి సురేష్ మండిప‌డ్డారు.

కాగా.. పర్యావరణ దీనిత్సవం సందర్భంగా రాజ‌మ‌హేంద్రవ‌రంలో మంత్రి ఆదిమూలపు సురేష్.. ఎంపీ భ‌రత్‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అంద‌రూ ముందుకు రావాల‌ని కోరారు. మ‌రో వైపు రాష్ట్రంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా ప్రతిపక్షాలన్నీ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం మండిపడుతున్నాయి. ఈ క్రమంలో పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ మరింత క్లారిటీ ఇచ్చారు.

Also Read:

CM Jagan: విష‌మ పరిస్థితుల్లో డాక్ట‌ర్.. వెంట‌నే స్పందించి రూ. కోటి విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్

Viral Video: వరదలో కొట్టుకుపోతూ చెట్టుకొమ్మ పట్టుకున్న మహిళ.. క్షణాల్లో కాపాడిన రెస్క్యూ బృందం