AP DME Vijayawada Assistant Professor Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయవాడలోనున్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (AP DME).. లేటరల్ ఎంట్రీ, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు: రేడియో డయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: జూన్ 13, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు
పే స్కేల్: నెలకు రూ.92,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీనియర్ రెసిడెన్సీగా ఏడాదిపాటు పనిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, హనుమాన్‌పేట, విజయవాడ-520003, ఏపీ.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.