Odisha Train Accident: మీకు తెలిసిన వాళ్ల ఆచూకి తెలియకపోతే ఈ నెంబర్‌కు వివరాలివ్వండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచన

ఒడిషాలోని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందాగా 800 మందికి పైగా గాయాలుపాలయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Odisha Train Accident: మీకు తెలిసిన వాళ్ల ఆచూకి తెలియకపోతే ఈ నెంబర్‌కు వివరాలివ్వండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచన
Odisha Train Accident

Updated on: Jun 03, 2023 | 8:54 PM

ఒడిషాలోని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందాగా 800 మందికి పైగా గాయాలుపాలయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ స్పందించారు. ఈ ప్రమాదంలో కనబడని ప్రయాణికులు లేదా క్షతగాత్రుల సమాచారం కోసం రాష్ట్ర అత్యవసరం ఆపరేషన్ సెంటర్‌లో 24/7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఈ రైలు ప్రమాదంలో ఎవరి బంధువులు,స్నేహితులైనా ఆచూకి తెలియకపోతే సమాచారం కోసం 8333905022 వాట్సప్ నెంబర్ కు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు పంపించాలని సూచించారు. అలాగే 1070, 112, 18004250101 నెంబర్లకు కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని సంబంధిత ప్రజలకు తిరిగి సమాచారం అందిస్తామని తెలియజేసారు.

ఇవి కూడా చదవండి