DGP Gautam Sawang: అసత్య ప్రచారాలు మానుకోండి.. ఆ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ గౌతమ్ సవాంగ్

|

Oct 26, 2021 | 5:31 PM

AP DGP Gautam Sawang on Drugs: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో గంజాయి నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

DGP Gautam Sawang: అసత్య ప్రచారాలు మానుకోండి.. ఆ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
Gautam Sawang
Follow us on

AP DGP Gautam Sawang on Drugs: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో గంజాయి నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టంచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణపై డీజీపీ మంగళవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నెలపాటు గంజాయిపై అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌ఐఏ సహకారంతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ స్పష్టం చేశారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌కి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతంలో ఎన్నడలేని విధంగా రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేస్తూ గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తుల పై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరిని చట్టం ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే 463 మంది అంతర్ రాష్ట్ర నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టినట్లు డీజీపీ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు పదిహేను వందల వాహనాలను జప్తు చేసి, ఐదు వేల మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. సంబంధం లేని అంశాలపై అసత్య ఆరోపణలను మానుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని గౌతమ్ సవాంగ్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా గంజాయి సాగు చేస్తున్నారని.. నియంత్రణకు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత పదేళ్లతో పోలిస్తే గతేడాది స్వాధీనం చేసుకున్న గంజాయే ఎక్కువ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.

Also Read:

YS Jagan: కృషి చేస్తే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.. ఐఐటీ ర్యాంకర్లకు సీఎం వైఎస్ జగన్ ఉద్భోద..

టీడీపీ నేత పట్టాభి వీడియో విడుదల.. ఎందుకు దేశం విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చిందంటే.?