Kunki Elephants: కర్ణాటక నుంచి ఏపీకి కుంకీ ఏనుగులు.. అసలు వాటి ప్రత్యేకత ఏంటో తెల్సా
ఇటీవల కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పంట పొలాల మీద గుంపులుగా దాడిచేసి నానా బీభత్సం చేస్తున్నాయి. అడ్డువచ్చిన అమాయకులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో జనాలు ఏనుగులను చూసి భయంతో పారిపోతున్నారు.
ఇటీవల కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పంట పొలాల మీద గుంపులుగా దాడిచేసి నానా బీభత్సం చేస్తున్నాయి. అడ్డువచ్చిన అమాయకులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో జనాలు ఏనుగులను చూసి భయంతో పారిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు, పార్వతిపురంలో ఏనుగులు నానారచ్చ చేస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు కుంకీ ఏనుగులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో కర్నాటకలో ఉండే ఈ ప్రత్యేక ఏనుగులను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అసలు కుంకీ ఏనుగులు అంటే ఏమిటీ, వీటికి అంత ప్రత్యేకత ఏమిటి? వీటికి ఎందుకంత డిమాండ్ అనే చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది.
కొన్ని ఏనుగులను మావటివాళ్లు మచ్చిక చేసుకుని పెంచుకుంటారు. వాటికి సంతానం కల్గినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఆహారం పెడతారు. ఇతర ఏనుగుల్లా కాకుండా వీటిని ప్రత్యేకంగా ట్రైన్ చేస్తారు. దీంతో ఇవి బలిష్టంగా తయారౌతాయి. ఇవి తమ మావటి వాళ్లు చెప్పింది.. తూచా తప్పకుండా పాటిస్తాయి. ఇవి పెరిగి పెద్దవయ్యాక.. వీటిని గ్రామాల్లో ప్రవేశించిన అడవి ఏనుగుల్ని ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. జనావాసాల్లో చొరబడిన అడవి ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమివేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కుంకీలను గాయపడిన ఏనుగుల్ని కాపాడటం కోసం, అడవిలో దాడులు చేస్తున్న ఏనుగుల్ని శాంతపర్చడం కోసం కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల అడవి ఏనుగుల్ని మానవ స్థావరాలకు దూరంగా తరిమేస్తుంటారు. ఈ కుంకీ ఏనుగులు మావటి వాళ్లు చెప్పిందే వింటాయి. అందుకు వీటిని ప్రత్యేకంగా ఆయా ప్రభుత్వాలు ప్రొత్సహిస్తాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కుంకీ ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అదే విధంగా వీటిని వివిధ రాష్ట్రాలలో ఉత్సవాలకు, తిరునాళ్లకు కూడా అద్దెకు తీసుకెళ్తుంటారు.
పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో ఈ ఏనుగులు ఉన్నట్లు తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో బెంగళూరు టూర్‌లో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్నాటక రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో రైతుల పొలాలను ధ్వంసం చేస్తూ నష్టపరుస్తున్న అడవి ఏనుగులను తరిమి కొట్టేందుకు కొన్ని కుంకీ ఏనుగులను తమకు ఇవ్వాల్సిందిగా కోరారు.
ఇది చదవండి: జెంటిల్‌మెన్ సినిమాలో మెరిసిన ఈ వయ్యారి గుర్తుందా.? ఇప్పుడెలా ఉందో చూశారా.!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..