YSRCPలో రెండు వర్గాలుగా రెడ్లు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వర్గంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేసిన నారాయణస్వామి..

YSRCPలో రెండు వర్గాలుగా రెడ్లు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు
AP Deputy CM Narayana Swamy (File Photo)

Updated on: Apr 29, 2022 | 1:03 PM

అధికార వైఎస్సార్ సీపీలో రెడ్డి సామాజిక వర్గ నేతలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేసిన నారాయణస్వామి.. వాలంటీర్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసిపిలో రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు.. దళితులపై పడుతున్నారని అన్నారు. దళితులను విభజిస్తున్నారని అన్నారు. రెడ్లు ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు. రెడ్లు లేకపోతే తాను గెలవలేనని అన్నారు. వైసీపీలో ఉంటూ రెడ్లు రెండు వర్గాలుగా విడిపోవడంతో మధ్యలో దళితులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. రెడ్లు వర్గ పోరుకు స్వస్తి చెప్పి ఒకటిగా ఉండాలని డిప్యూటీ సీఎం కోరారు. రెడ్లపై నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఏమన్నారో వీడియోలో చూడండి..

మరిన్ని రాజకీయ వార్తలు చదవండి..

Also Read..

Viral Video: చిరుతపులి చెట్టు దిగే పద్దతి చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..!

Bhadrachalam: మత్తుమందు ఇచ్చి గర్భిణిపై ఎంఎన్‌వో అత్యాచారయత్నం.. భద్రాచలంలో అమానుష ఘటన