Andhra Pradesh Deputy CM Narayana Swami : అయనో ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి తరువాత అంతటి పదవి. అంతే కాదు.. అయన ముఖ్యమంత్రి కన్నా వయస్సులో పెద్దవాడు. అయితేనేం, అయన తన కన్నా చిన్నవాడైనా ముఖ్యమంత్రి కాళ్లపై పడబోయాడు. సియం వారిస్తున్నా.. మరి వంగివంగి దండాలు పెట్టాడు. ఉప ముఖ్యమంత్రి ప్రవర్తన పై అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు.. త్వరలో మంత్రి వర్గ విస్తరణ అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో.. తన పదవిని కాపాడుకోవడానికే అయన ముఖ్యమంత్రి కాళ్లమీద పడ్డాడా? ఇంతకీ ఎవరా ఉపముఖ్యమంత్రి? ఎక్కడ ఈ తంతు జరిగింది?
విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు సియం జగన్మోహన్ రెడ్డి గత నెల 30న శంఖుస్థాపన చేశారు. ఆ శంఖుస్థాపన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్లొన్నారు. అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అదే రోజు క్యాబినెట్ ఉండటంతో.. ముందుగా కరకట్ట విస్తరణ పనులకు శంఖుస్థాపన చేసి అనంతరం కేబినెట్ మీటింగ్ కు సియం హజరవ్వాల్సి ఉంది. సియం జగన్ కరకట్ట వద్ద చేరుకోని కారు దిగిన సియం జగన్ కు ఒక్కోక్కరు చోప్పున పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలుకుతున్నారు. కొందరి తరువాత ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వంతు వచ్చింది. ఇంతలోనే సియం జగన్ కు నమస్కరించి..అనంతరం సియం కాళ్ల మీద పడబోయాడు డిప్యూటీ. అలా చేయోద్దని సియం వారించినా వినకుండా ఇలా మూడు సార్లు చేశారు. దీంతో సియం జగన్.. డిప్యూటీ నారాయణ స్వామీ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అన్నా.. మీరు నాకన్నా పెద్దవారు మీరు అలా చేయకూడదని వారించారు.
మంత్రి వర్గం కొలుదీరిన రోజే సియం జగన్.. మంత్రులకు రెండున్నర సంవత్సరాలే మీ పదవులు.. పని విధానం బట్టే పొడిగింపు అని ప్రకటించారు. ఇప్పుడు జగన్ సర్కార్ కొలువు దీరి రెండేళ్లు పూర్తయ్యి మూడో ఏడు నడుస్తోంది. దీంతో త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి గా ఉన్న నారాయణ స్వామి తన కన్న చిన్న వాడైన సియం జగన్ కాళ్ల మీద పడటం వెనుక మంత్రి పదవి ఊడుతుందేమోనన్న భయం పట్టుకుందని ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే నారాయణ స్వామి మంత్రిగా ఉన్నప్పటికీ అయనకు కేటాయించిన శాఖల్లో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. అదే సమయంలో అయన క్రింద డిపార్ట్ మెంట్ హెడ్స్ ఎవరూ అయన మాట వినడం లేదని ప్రచారం. దీంతో అయన సరిగా పని చేయడం లేదని.. డిపార్ట్ మెంట్ ను అధికారులే నడిపిస్తున్నారని భోగట్టా. త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిగితే, అయన పదవికి గండం తప్పదని ఊహాగానాలు. సియం కాల్మొక్కితే కనికరిస్తారేమని అయన అలా చేసుంటాడని సచివాలయంలో వినిపిస్తోన్న మాట.
Read also: Bonalu – Bakrid Festivals: పశు రవాణాపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు