ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 71,758 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 2224 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,82,096కి చేరింది. ఇందులో 42,252 యాక్టివ్ కేసులు ఉండగా.. 18,27,214 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 31 మంది ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 12,630కు చేరుకుంది.
ఇక గడిచిన 24 గంటల్లో 4714 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,18,04,691 సాంపిల్స్‌ను పరీక్షించారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 66, చిత్తూరు 409, తూర్పుగోదావరి 299, గుంటూరు 191, కడప 173, కృష్ణా 222, కర్నూలు 66, నెల్లూరు 116, ప్రకాశం 157, శ్రీకాకుళం 51, విశాఖపట్నం 122, విజయనగరం 93, పశ్చిమ గోదావరి 259 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..